PAVANI KARANAM: పరేషాన్ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా హీరోయిన్ పావని కరణంతో (PAVANI KARANAM) హిట్ టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ చేసింది. సమోస తింటావా శిరీష అనే డైలాగ్ మూవీలో ఉంటుందని.. ఎంతమంది శిరీషలు ఉన్నారో అందరికీ అదీ కనెక్ట్ అవుతుందని పావని చెబుతున్నారు. తనకు ఇంతకన్నా బెస్ట్ కంప్లిమెంట్ ఏం ఉంటుందని అడిగారు. పరేషాన్ మూవీకి ఆడిషన్ ద్వారా సెలెక్ట్ అయ్యానని వివరించారు. పరేషాన్ మూవీ హీరో తిరువిర్ తనకు ముందే తెలుసు అని.. ఇద్దరం కలిసి సిన్ అనే వెబ్ సిరీస్ తీశామని తెలిపారు.
కో యాక్టర్ బాగుంటే ఆ ఎనర్జీ వేరు అని పావని అంటున్నారు. తిరువిర్ తాను ఇద్దరం కలిసి మంచి రెస్పెక్ట్ ఇచ్చుకుంటామని తెలిపారు. మూవీలో ఐజాక్- శిరీష మధ్య కెమిస్ట్రీ చక్కగా వర్కవుట్ అయ్యిందని అంటున్నారు. సినిమాలో ఆగం సత్య కనిపించకుండా పోయి.. దొరికిన తర్వాత వచ్చే సీన్ చాలా ఎంజాయ్ చేశానని వివరించారు. మూవీని రానా తీస్తున్నారనే విషయం తనకు తెలియదని పేర్కొన్నారు. ఏప్రిల్ 1వ తేదీన రామానాయుడు స్టూడియోకు వెళ్లాం అని.. అప్పుడే తెలిసిందని చెప్పారు. రానా సింపుల్‌గా ఉంటారని.. సినిమాను చాలా ప్రేమిస్తారని చెప్పారు.
పుష్పలో అజయ్ కూతురు రోల్ చేశానని.. హిట్-2లో ఫోరెన్సిక్ ఆఫీసర్ పాత్ర చేశానని పావని చెప్పారు. ఆ రెండు సినిమాలు చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఇతర సినిమాలు చేయలేదన్నారు. పుష్ప-2లో కూడా తన రోల్ ఉంటుందని చెప్పారు. శ్రీవల్లి సాంగ్ తమిళనాడులో తీశారని.. ఆ రోజు తన తొలి షూటింగ్ అని వివరించారు. ఫస్ట్ టేక్‌లోనే షాట్ అయిపోయిందని చెప్పారు. కెమెరా వైపు చూడాలని అల్లు అర్జున్ తనకు సజెస్ట్ చేశారని గుర్తుచేశారు.