AP: బోయింగ్ యూత్ స్కిల్ ప్రోగ్రాంలో మూడో బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకుంది. బోయింగ్ ఇండియా, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులను ఎంపీ శ్రీభరత్ అభినందించారు. ఈ కార్యక్రమం విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జరిగింది. విద్యార్థుల్లో సమగ్ర నైపుణ్యం ఉంటే ఉన్నత స్థానాలకు ఎదుగుతారని ఎంపీ తెలిపారు.