SKLM: క్షయ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని DM&HO డా.బాలకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమాలను గురించి శనివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. క్షయ అంటువ్యాధి అని, ఇది గాలి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.