CTR: విజయపురం మండలంలోని కేవీపురం దళిత వాడకు చెందిన జగనన్న కాలనీని నగరి ఆర్డీఓ భవానీ శంకర్ శుక్రవారం పరిశీలించారు. గత ప్రభుత్వం కేవీపురం దళితవాడ చెందిన 78 మందికి జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు ఇచ్చింది. అక్కడి పరిస్థితులను ఆమె స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. అర్హత కలిగిన వారికి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.