SKLM: ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల ప్రయోజనార్థం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో అత్యాధునిక ప్రయోగశాలలను అందుబాటులోకి తీసుకువచ్చామని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.ఆర్. రజని అన్నారు. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రయోగశాలను బుధవారం ఆమె ప్రారంభించారు.