VSP: విశాఖలోని రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ పునరుద్ధరణపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ కోసం పర్యాటక శాఖ అధికారుల కృషిని, విశాఖ కలెక్టర్ హరేంద్రీ ప్రసాద్ చొరవను మంత్రి దుర్గేష్ అభినందించారు.