కృష్ణా : మచిలీపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మచిలీపట్నంతో పాటు అన్ని ఆర్డిఓ కార్యాలయాల్లో, తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాల్లో అర్జీలు సేకరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.