ప్రకాశం: ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు మూడు రోజుల్లో పరిష్కారం చూపాలని కనిగిరి తహసిల్దార్ వీఆర్వోలను ఆదేశించారు. ఆదివారం వీఆర్వోలతో తహసిల్దార్ సమావేశమయ్యారు. అర్జీలను పరిశీలించి ఒకవేళ పరిష్కరించలేకపోతే ఎందుకు పరిష్కరించలేకపోతున్నామో దరఖాస్తుదారుడికి వివరించాలని తహసిల్దార్ ఆదేశించారు.