ప్రకాశం: ఒంగోలులో ఈఎస్ఐ హాస్పిటల్స్ స్థాపించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కోరారు ఢిల్లీలో ఆదివారం జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో చిన్న, మధ్యతరహా, పెద్ద కర్మాగారాలలో 86,000 మంది ఉద్యోగులు, కార్మికులు ఉన్నారని తెలిపారు. ఈఎస్ఐ హాస్పిటల్ లేకపోవటంతో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స ఖర్చులు భరించలేక వారు ఇబ్బందిపడుతున్నారన్నారు.