E.G: కూటమి ప్రభుత్వం ఉద్యోగుల జీవితాల్లో పండుగ తెచ్చిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 6,200 బకాయిలు చెల్లించేందుకు తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. CPS, GPF, APGAI బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించనుందన్నారు. ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు సమయానికి పడుతున్నాయన్నారు.