VSP: సోమవారం విశాఖలో జరగనున్న క్రికెట్ మ్యాచ్కు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనుందని ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సుమారు 30 బస్సుల వరకు వివిధ ప్రాంతాల నుంచి మధురవాడ క్రికెట్ స్టేడియానికి నడపనున్నామన్నారు. గాజువాక , సింహాచలం, కూర్మన్నపాలెం నుంచి మధురవాడకు బస్సులు నడుపుతామన్నారు.