PPM: చెత్త నుంచి సంపద సృష్టి ఉత్తుత్తి మాటలే అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగల డాలి నాయుడు అన్నారు. ఈ మేరకు పట్టణంలోని డంపింగ్ యార్డ్‌ను ఆదివారం ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రతిరోజు పార్వతీపురంలో తయారవుతున్న 15 మెట్రిక్ టన్నుల చెత్తను మున్సిపాలిటీ వృథాగా డంప్ చేస్తుందన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతుందన్నారు.