VZM: సీఎం చంద్రబాబు ఇటీవల ప్రారంభించిన “స్వచ్ఛ ఆంధ-స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమం స్ఫూర్తిగా రోటరీ క్లబ్ ఆఫ్ నర్తనశాల, ఇంటరాక్ట్ క్లబ్ ఆఫ్ నర్తనశాల సభ్యులు ఆదివారం పెదచెరువు వాకింగ్ పాత్ను శుభ్రపరిచారు. ఇలాంటి పరిశుభ్రత కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహిస్తామని సభ్యులు ప్రదీప్తి, అపర్ణ, వర్షిణి, గౌరి, వినీల తెలిపారు.