ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న చదలవాడ పద్మజ (52) ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని కొండేపల్లి రోడ్ లోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకుగల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదు బాబు తెలిపారు.