PPM: ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ కోరారు. కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉందని కలెక్టర్ తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో, బీ టెక్ ఉత్తీర్ణులైన వారు, దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ 500కు పైగా ప్రముఖ పరిశ్రమలలో ఇంటర్న్షిప్ పొందవచ్చు అన్నారు.