GNTR: కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిష్టాత్మకమైన అమరావతి చిత్ర కళకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. గుంటూరులో శనివారం ఆయన స్వయంగా చిత్రం గీసి కళాకారులకు ప్రోత్సహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పోడపాటితో కలిసి ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో ఆయన భాగస్వాములయ్యారు.