PPM: క్షయ నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కోరారు. ఈనెల 24న ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో శనివారం పోస్టర్స్ విడుదల చేశారు. క్షేత్ర స్థాయిలో సర్వే చేసి క్షయ వ్యాధి లక్షణాలు ఉన్న వారిని వైద్య సిబ్బంది గుర్తించాలన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కఫం పరీక్షలు నిర్వహిస్తారన్నారు.