VZM: గత ఏడాది గుర్లలో డయేరియా కారణంగా మృతి చెందిన 10 మంది కుటుంబాలకు జనసేన నేతలు శనివారం చెక్కులు పంపిణీ చేశారు. గతంలో గుర్లలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్ధిక సహాయం ప్రకటించారు. ఆ మొత్తాన్ని ఎమ్మెల్యే లోకం మాధవి, టిడ్కో ఛైర్మన్ అజయ్ బాబు, తూర్పు కాపు ఛైర్మన్ యశస్వి, మాజీ మంత్రి అరుణ బాధిత కుటుంబాలకు అందజేశారు.