సత్యసాయి: జిల్లాలో వర్షం పడింది. తనకల్లు, నంబులపూలకుంట, ఆమడుగూరు తదితర మండలాల్లో ఇవాళ సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. తనకల్లులో వండగండ్ల వాన పడింది. కొద్దిరోజులుగా వడగాలులు, తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. మరోవైపు ఆకాశం మేఘావృతమై ఉంది. చల్లటి గాలులు వీస్తున్నాయి.