ASR: అనంతగిరి మండలం వేంగడ పంచాయతీ గోమంగిపాడు, బందవలస, మండ్రువలస గ్రామాలలో రోడ్డు, త్రాగునీరు, పారెస్ట్ పట్టాలు మంజూరు చెయ్యాలని సీపీఎం మండల నాయకుడు శివేరి కొండలరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామంలో ఆయన పర్యటించి స్థానిక గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.