బీహార్లోని గయా జిల్లాలో ఇమ్రోజ్ అలీ అనే ఉపాధ్యాయుడు వినూత్నంగా ఆలోచించారు. బడికి రాని విద్యార్థుల కోసం ఆయన తన బృందంతో మేళతాళాలు వాయిస్తూ నేరుగా వారి ఇళ్లకు వెళ్తున్నారు. ఈ సంగీతంతో పిల్లలను ఉత్సాహంగా పాఠశాలకు రప్పిస్తున్నారు. ఆయన కృషి వల్ల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీంతో ఆ ఉపాధ్యాయుడిని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు నెటిజన్లు అభినందిస్తున్నారు.