AP: ఓ వైపు సీడ్, ఫీడ్ ధరల పెరుగుదల, మరోవైపు రొయ్యల రేట్ల పతనంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది టన్ను మేత ధర రూ.75 వేలు ఉండగా ప్రస్తుతం రూ.95 వేలకు చేరింది. వ్యాపారులు సిండికేట్గా మారడంతో 15 రోజుల్లో 100 కౌంటు(కిలోకి సగటున 100 రొయ్యలు తూగడం) ధర రూ.270 నుంచి రూ.215కు పడిపోయింది. దీంతో టన్నుకు రూ.45 వేల వరకు నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు.