AP: గత ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీని రాజకీయ కూలీల ఉపాధిగా మార్చేశారని డిప్యూటీ సీఎం పవన్ మండిపడ్డారు. ఉపాధి లేని వారికి జాతీయ ఉపాధి హామీ పథకం ఉపాధి కల్పిస్తోందన్నారు. ఉపాధి అవసరమైనప్పుడు తను కూడా నరేగా ద్వారా పని చేస్తానని వెల్లడించారు. రాయలసీమ నేలలో నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో లక్షా 55 వేల పంట కుంటలు మేలోగా పూర్తి కావాలని ఆదేశించారు.