China Thanks To India:డ్రాగన్ చైనా (China) భారతదేశానికి (India) ధన్యవాదాలు తెలిపింది. సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడే చైనా.. థాంక్స్ చెప్పడానికి కారణం ఉంది. హిందూ మహాసముద్రం మధ్యలో చైనాకు (China) చెందిన చేపల ఓడ మునిగిపోయింది. ఇద్దరు నావికులు చనిపోయారు. ఓడలో మరో 37 మంది నావికులు ఉండగా.. భారత (India) నేవీ రంగంలోకి దిగింది. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని చైనాకు సాయం చేసింది.
భారత్ (India) రంగంలోకి దిగడంతో ఇండోనేషియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, మాల్దీవ్ దేశాలు కూడా పాల్గొన్నాయి. దీంతో ఆయా దేశాలకు చైనా విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలియజేసింది. కష్ట సమయంలో సాయం చేసిన దేశాలు అన్నింటిని కొనియాడింది.
చైనాకు (China) చెందిన లుపెంగ్ యువాన్యు 028 చేపల ఓడ మంగళవారం హిందూ మహాసముద్రంలో మునిగింది. ఆ ఓడలో 39 మంది నావికులు ఉన్నారు. చైనా, ఇండోనేషియాకు చెందిన వారు 17 మంది చొప్పున.. ఫిలిప్పైన్స్కు చెందిన ఐదుగురు ఉన్నారు.
కడపటి సమాచారం అందేవరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చైనాకు (China) చెందిన 10 ఓడలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మరిన్ని ఓడలను తీసుకొస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మునిగిన ఓడను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.