భూమి పరిమాణానికి సరిపోయే మరో గ్రహాన్ని NASA గుర్తించింది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా మానవులు జీవించే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఈ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
మనమంతా భూమిపై నివసిస్తున్నాం. ఈ భూమి మొత్తం నిండిపోతే తర్వాతి జనరేషన్స్ పరిస్థితి ఏంటి? అనే అనుమానం చాలా మందికి ఉంది. అందుకే మనుషులు జీవించగలిగే మరో ప్రాంతం ఏదైనా ఉందా అని ఎప్పటి నుంచో పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. కాగా, వారి పరిశోధనలు ఫలించాయి. భూమి లాంటి మరో గ్రహాన్ని(planet) ఎట్టకేలకు కనిపెట్టారు.
అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ (NASA) సరికొత్త గ్రహాన్ని కనిపెట్టింది. ఆ గ్రహం భూమి లక్షణాలతో ఉంది. భూమి కంటే కొద్దిగా పెద్దగా ఉంది. కానీ నిండా అగ్ని పర్వతాలతో ఉంది. అది మన సౌర వ్యవస్థకు అవతల ఉంది. దానికి శాస్త్రవేత్తలు LP 791-18 d అనే పేరు పెట్టారు. ఈ గ్రహంపై తరచూ అగ్ని పర్వతాలు పేలుతూ ఉండొచ్చని నాసా అంచనా వేసింది. నాసాకి చెందిన ట్రాన్సిటింగ్ ఎగ్జోప్లానెట్ సర్వే శాటిలైట్ ద్వారా ఈ కొత్త గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. రిటైర్ అయిన స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ సాయం కూడా తీసుకున్నారు. అలాగే.. భూమిపై ఉన్న కొన్ని అబ్జర్వేటరీలు కూడా ఇందుకు ఉపయోగపడ్డాయి.
ఈ గ్రహంపై అగ్నిపర్వతాలతోపాటూ.. నీరు కూడా ఉన్నట్లు కనిపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కొత్త గ్రహం(planet) మన భూమి కంటే కొద్దిగా ఎక్కువ వేడిగా ఉంటుంది అంటున్నారు. దీనికి ఎప్పుడూ ఒకేవైపు వేడి, ఎండ పడుతున్నాయనీ, రెండోవైపు ఎలా ఉందో తెలియట్లేదని తెలిపారు. రెండోవైపు ప్రాంతంలో అగ్ని పర్వతాలతోపాటూ… నీరు ఉండొచ్చనే అంచనా వేశారు. మరి జీవ ప్రాణి జీవించడానికి ఉపయోగపడుతుందో లేదో చూడాలి.