VSP: విశాఖ స్టీల్ సిటీ డిపోను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నేతలు శుక్రవారం కలెక్టర్ హరేందిర ప్రసాద్‌కు మెమొరాండం సమర్పించారు. 98 రోజులుగా జరుగుతున్న నిరాహార దీక్షల కారణంగా కార్మికుల్లో నెలకొన్న ఆందోళన పరిస్థితిని కలెక్టర్‌కు వివరించారు. డిపో తరలింపు వల్ల ఇబ్బందులను వివరించారు.