NZB: సాలూర మండలం ఫతేపూర్ సర్పంచ్ నూర్ అహ్మద్‌తో పాటు 8 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో వారు శుక్రవారం ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి కృషి చేయాలని వారికి సూచించారు.