NZB: రాష్ట్రస్థాయి సీనియర్ గర్ల్స్ ఇండియా రౌండ్ విలు విద్య పోటీలకు ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా విలువిద్య కార్య దర్శి గంగరాజు తెలిపారు. ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగారంలోని రాజారం స్టేడియంలో నిర్వహించిన ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు హైదరాబాద్లోని కొల్లూరులో ఈనెల 7న ఆదివారం జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు చెప్పారు.