VZM: రాష్ట్ర జీవవైవిధ్య మండలి ఆధ్వర్యంలో బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ (బీఎంసీ) సభ్యులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం పూల్‌బాగ్ ఫారెస్ట్ కాంప్లెక్స్‌లో శుక్రవారం నిర్వహించారు. జీవవైవిధ్య చట్టం-2002 అమలు, జీవవైవిధ్య సంరక్షణ, బీఎంసీల పాత్ర, కార్యాచరణ ప్రణాళికలు, ఔషధ మొక్కలు, బయోరిసోర్సుల వినియోగంపై నిపుణులు అవగాహన కల్పించారు.