కోనసీమ: జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా రెట్టింపు సందడి వచ్చేలా ఎస్.యానాం బీచ్లో నిర్వహించే సంక్రాంతి సంబరాలు పనుల ఏర్పాట్లను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పరిశీలించారు. బీచ్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మెట్ల రమణ బాబు, అముడా ఛైర్మన్ అల్లాడ స్వామినాయుడు పాల్గొన్నారు.