సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో పలు నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్వోలు నామినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. చింతలపాలెం, దొండపాడు, మేళ్లచెర్వు, రామాపురం పంచాయతీల్లో ఏర్పాటు చేసిన సర్పంచ్–వార్డు సభ్యుల నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు.