కోనసీమ: ద్రాక్షారామంలో ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి అన్నదాన పథకానికి శుక్రవారం యనమండ్ర భీమశంకరం, మాణిక్యాంబ దంపతులు రూ.లక్ష, అలాగే దర్భ సూర్య శంకరం రూ.50 వేలు విరాళంగా ఆలయ అధికారులకు అందజేశారు. ముందుగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ ఈవో స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.