హన్మకొండ కలెక్టరేట్లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. అదనపు కలెక్టర్, ఇంఛార్జ్ డీఈవో వెంకటరెడ్డితో పాటు విద్యాశాఖ సెక్షన్ అసిస్టెంట్లు గౌస్, మనోజ్ రూ.60,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. పాఠశాల అనుమతులకు సంబంధించి రూ.1,00,000 డిమాండ్ చేయగా, ఏసీబీ వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.