పార్వతీపురం జిల్లాలో రైతు ధాన్యం కొనుగోలు గోల్మాల్లా ఉన్నాయని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఓ.బి.సి. జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు మాట్లాడుతూ.. పార్వతీపురం మండలంలోని ఏమ్మార్ నగరం, వెంకంపేట గ్రామాల రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.