W.G: పెనుగొండ మండలం సిద్ధాంతంలో ఇవాళ రాత్రి జై భవాని, జై జై భవాని అంటూ భక్తుల నినాదాలతో మార్మరోగింది. గురు భవాని మూడేళ్ల శ్రీను భవాని ఆధ్వర్యంలో సుమారు 200 మంది భవాని భక్తులు దుర్గమ్మ తల్లికి సహస్రనామాలు, సువర్ణ ద్రవ్యాలతో కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం అమ్మవారి జ్యోతులతో గ్రామంలో ఊరేగించి నిప్పుల గుండం తొక్కారు.