BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని GP ఎన్నికల ప్రచారం వేడెక్కింది. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సూదనబోయిన ఓంప్రకాష్ సాయంత్రం ఇంటింటా గడపగడపకు ప్రచారం చేశారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలతో కలిసి విస్తృత పర్యటన నిర్వహించారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, మహిళా సంక్షేమం సమస్యల పరిష్కారం, గ్రామ అభివృద్ధే ప్రాధాన్యమని ఓంప్రకాష్ హామీ ఇచ్చారు.