E.G: గండేపల్లి మండలం సింగరంపాలెం గ్రామంలో 33/11 విద్యుత్ సబ్ స్టేషన్ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.3.29 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ సబ్ స్టేషన్ మూడు గ్రామాలకు ఉపయోగపడుతుందన్నారు. ఈ మూడు గ్రామాలలో లో వోల్టేజ్ సమస్య నేటితో తీరుతుందని ఎమ్మెల్యే తెలిపారు.