పెద్దపల్లిలో రీజనల్ టాస్క్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతం అయ్యింది. జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ మాట్లాడుతూ.. 16 ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరై, 931 నిరుద్యోగ యువతీ-యువకులు పాల్గొన్న ఈ జాబ్ మేళాలో 81 మందికి ఉద్యోగాలు కేటాయించబడ్డాయని తెలిపారు. కలెక్టరేట్ అధికారులు నియామక పత్రాలు అందజేశారు.