SKLM: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి రథసప్తమి మహోత్సవాలకు పటిష్ట బందోబస్తు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. భక్తులు దర్శనార్థం బారికేడ్లు ఏర్పాట్లపై ప్రణాళిక బద్ధంగా ఆలోచన చేయాలన్నారు. తిరువీధి స్వామి అలంకరణపై దృష్టి సారించాలన్నారు.