J.N: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా దేవరుప్పుల మండలంలోని కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన BRS పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థిగా చింత రవి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అధికారికంగా దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు ఏప్పుడు అండగా ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. నామినేషన్ కార్యక్రమంలో బస్వా సావిత్రి తదితరులు పాల్గొన్నారు.