W.G: బాల్యవివాహాల నివారణపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సీడీపీఓ శ్రీలక్ష్మీ పేర్కొన్నారు. తణుకు మున్సిపల్ పరిధిలోని వీరభద్రపురం సచివాలయంలో ఇవాళ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమనే విషయాన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. సూపర్ వైజర్ మహాలక్ష్మీ, CDPO సభ్యులు సత్యనారాయణ పాల్గొన్నారు.