MHBD: జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ను ఇవాళ దళిత వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కట్కూరి ప్రసాద్ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో జర్నలిస్టులు ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దళిత వర్కింగ్ జర్నలిస్టు సభ్యులు పాల్గొన్నారు.