MDK: శివంపేట మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన బొగ్గుల శ్రావణి (19) అదృశ్యమైనట్లు ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు. రత్నాపూర్కు చెందిన శ్రావణి డిగ్రీ వరకు చదివి ఇంటివద్దనే టైలరింగ్ పనులు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం ఊర్లో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లి కనిపించకుండా పోయినట్లు తెలిపారు. తండ్రి వెంకటేష్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.