విశాఖలో భిక్షాటనకు అడ్డుకట్ట వేసేందుకు చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా 17 మంది యాచకులను పోలీసులు గుర్తించి షెల్టర్ హోమ్‌కు పంపించారు. పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ భాస్కర్, ప్రసాద్ నేతృత్వంలో కురుపాం మార్కెట్, రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాల్లో ఈ చర్య చేపట్టారు.