కోనసీమ: రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని కొత్తపేట ఆర్డీవో శ్రీకర్ తెలిపారు. కొత్తపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం ఆయన డివిజన్ పరిధిలోని నీటి సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి సంఘాల పరిధిలోని రైతులు సాగునీటి సరఫరా విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు చేపడతాన్నారు.