MDK: జిల్లా కేంద్రంలో ఈ నెల 7 నుంచి నిర్వహించే సీఐటీయు రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మన్నె నర్సింలు కోరారు. శుక్రవారం తూప్రాన్ పట్టణ పరిధి పోతరాజుపల్లి విద్యుత్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర మహాసభలు విజయవంతం చేసేందుకు కార్మికులంతా తరలిరావాలని కోరారు.