»Global Temperatures Likely To Surge To Record Highs In Next 5 Years Says Un Weather Agency
UN weather agency: ఎండలపై ఐక్యరాజ్య సమితి హెచ్చరికలు..!
బటయ ఎండలు మండిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండాలు భయంకరంగా ఉన్నాయి. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే కూడా భయం వేస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. బయట అడుగుపెట్టకుండా, ధాని ప్రభావం ఇంట్లో కూడా తెలిసిపోతోంది. మన దేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి కనపడుతోంది.
ఐక్యరాజ్య సమతి ఉష్ణోగ్రతలపై ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. 2023-27 కాలాన్ని అత్యంత వేడితో కూడిన ఐదేళ్ల కాలంగా పేర్కొంది. 2016లో నమోదైన అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతల రికార్డు కూడా చెరిగిపోవచ్చని అంచనా వేసింది. ఈ ఐదేళ్లలో ఏదో ఒక ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది. 2023-27 మధ్య కాలంలో ఒక ఏడాది గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి 66 శాతం అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఎల్ నినోకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చింది. వాతావరణంలో మార్పులు ప్రపంచ ఉష్ణోగ్రతలను పైకి తీసుకెళతాయని అంచనా వేసింది.
‘‘దీనివల్ల ఆరోగ్యంపై ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయి. ఆహార భద్రత, నీటి నిర్వహణ, పర్యావరణపరమైన సవాళ్లు ఎదురవుతాయి. ఇందుకు సన్నద్ధం కావాల్సిందే’’ అని ప్రపంచ ఆరోగ్య వాతావరణ విభాగం సెక్రటరీ జనరల్ ప్రెట్టేరి తాలస్ పేర్కొన్నారు. 2023-27 మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు పారిశ్రామిక విప్లవం ముందు నాటి సగటుతో పోలిస్తే 1.5 – 1.8 డిగ్రీల వరకు ఎక్కువ నమోదు కావచ్చని తెలిపింది. పారిస్ అగ్రిమెంట్ ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రతలను ఈ శతాబ్దికి 2 డిగ్రీల పెరుగుదలకు పరిమితం చేయాలి.