మందు బాబులకు వోడ్కా(Vodka) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది వోడ్కాను ఇష్టంగా తాగుతారు. ఇది తాగేందుకే కాకుండా జుట్టు సంరక్షణ(hair care)కు కూడా ఉపయోగపడుతుంది.
Vodka : మందు బాబులకు వోడ్కా(Vodka) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది వోడ్కాను ఇష్టంగా తాగుతారు. ఇది తాగేందుకే కాకుండా జుట్టు సంరక్షణ(hair care)కు కూడా ఉపయోగపడుతుంది. ఇది మీ జుట్టును మెరిపిస్తుంది. చుండ్రు(dandruff)ను తగ్గిస్తుంది. అంతేకాదు జుట్టు ఆరోగ్యంగా, పొడుగ్గా పెరిగేందుకు సహాయపడుతుంది. వోడ్కాతో అసలు జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..
అందమైన జుట్టుకోసం..
వోడ్కా జుట్టును అందంగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం ఒక కప్పు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల(Two Table spoons) వోడ్కా మిక్స్ చేసి జుట్టు మూలాలపై స్ప్రే చేయండి. వోడ్కాలోని ఆల్కహాల్(Alcohal) మీ జుట్టు మూలాలను ఎత్తడానికి సహాయపడుతుంది. ఇది మీ జుట్టు ఒత్తుగా, గుబురుగా కనిపించడానికి దోహదపడుతుంది.
హెయిర్ వాష్ గా..
వోడ్కా అద్భుతమైన హెయిర్ వాష్(Hair Wash). ఇది మీ జుట్టులోని మలినాలను తొలగిస్తుంది. ఇందుకు రెండు టేబుల్ స్పూన్ల వోడ్కాను ఒక కప్పు నీటిలో మిక్స్ చేయండి. మీ జుట్టును షాంపూతో కడిగిన తర్వాత చివరి వాష్ గా ఈ వోడ్కాను ఉపయోగించండి. వోడ్కాలోని ఆల్కహాల్ ఏదైనా ఇతర మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది.
హెయిర్ మాస్క్ గా..
మీ జుట్టుకు పోషకాలను అందించడానికి, బలోపేతం చేయడానికి హెయిర్ మాస్క్(Hair Mask) లో వోడ్కాను కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో ఒక గుడ్డు పచ్చసొన, ఒక టేబుల్ స్పూన్ తేనె(Honey), ఒక టేబుల్ స్పూన్ వోడ్కా ను కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు, నెత్తిమీద అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.
జుట్టు రాలడాన్ని నివారించడానికి..
జుట్టుకు వోడ్కాను ఉపయోగించడం వల్ల కూడా మీ జుట్టు రాలే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఇందుకోసం రెండు టీస్పూన్ల ఆముదం నూనె(castor oil)లో ఒక టీస్పూన్ వోడ్కా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని తలకు పెట్టి మసాజ్(Massage) చేయండి. ఒక గంట పాటు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.
స్కాల్ప్ ట్రీట్ మెంట్ గా..
మీకు చుండ్రు లేదా నెత్తిమీద ఏదైనా సమస్య ఉందా? అయితే మీరు వోడ్కాను ఖచ్చితంగా ఉపయోగించాల్సిందే.. ఎందుకంటే వోడ్కా సమర్థవంతమైన చికిత్స. ఇందుకోసం వోడ్కా, నీటిని సమాన భాగాలుగా చేసి రెండింటినీ కలపండి. దీన్ని నేరుగా మీ నెత్తికి అప్లై చేయండి. తర్వాత తలను కాసేపు మసాజ్ చేసి 30 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.