Mango : పచ్చి మామిడి తింటే క్యాన్సర్ తగ్గుతుందా.. నిజమెంత ?
ఎండాకాలం అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు(Mango Fruits). మామిడి కాయల కోసం మామిడి ప్రియులు... సంవత్సరం మొత్తం ఎండాకాలం(Summer) ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు.
Mango : వేసవి వచ్చింది.. ఎండాకాలం అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు(Mango Fruits). మామిడి కాయల కోసం మామిడి ప్రియులు… సంవత్సరం మొత్తం ఎండాకాలం(Summer) ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. సీజన్(Season) స్టార్ట్ అయి మార్కెట్లో(Market) మామిడి ప్రత్యక్షం కాగానే తెచ్చుకుని తినేసి ఆనందిస్తుంటారు. వేసవిలో పచ్చి మామిడితో ఊరగాయ పెట్టుకుంటారు. పండు సంగతి పక్కన పెడితే… పచ్చి మామిడి తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..
పచ్చి మామిడి పోషకాల గని. అందుకే మామిడి పండ్లలో రాజు అంటారు. దీనిలో విటమిన్లు(Vitamins), ఖనిజాలు, డైటరీ ఫైబర్ కెరోటినాయిడ్స్(Carotenoids) ఇందులో పుష్కలంగా ఉంటాయి. పచ్చి మామిడి నుండి పానీయం(Juice) కూడా తయారు చేస్తారు. ఇది మండుతున్న ఎండ నుండి మనకు చలువనందిస్తుంది. అంతేకాకుండా పచ్చి మామిడి వ్యాధులతో పోరాడే విటమిన్ సీ అందజేస్తుంది. పచ్చి మామిడి పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
పచ్చి మామిడి వల్ల ప్రయోజనాలు: గుండెకు మంచిది
పొటాషియం(Potassium), మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు మామిడిలో ఉంటాయి. ఇది మన గుండె(heart)ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. తక్కువ రక్తపోటు(blood pressure) ఉన్నవారికి కూడా ఇది ఉత్తమమైనది. మామిడిలో మాంగిఫెరిన్(Mangiferin) ఉంటుంది. సూపర్ యాంటీ ఆక్సిడెంట్(Super antioxidant)గా పనిచేస్తుంది. మామిడి పండ్లను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి.
చక్కెర నియంత్రిస్తుంది
ఇతర పండ్లతో పోలిస్తే, మామిడి(Mango)లో చక్కెర పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్(Sugar) పేషంట్లకు ఇది చాలా మేలు చేస్తుంది. మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా మన రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు.
రోగనిరోధక శక్తి పెంచుతుంది
పచ్చి మామిడికాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి(Immunity) పెరుగుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచే అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఒక కప్పు పచ్చి మామిడి రసం మొత్తం రోజువారీ విటమిన్ ఎ(Vitamin A)లో 10 శాతం అందిస్తుంది.
క్యాన్సర్ రాకుండా చేస్తుంది
మామిడి పండులో పాలీఫెనాల్(Polyphenol) ఉంది. ఇది క్యాన్సర్(Cancer) వంటి ప్రమాదకరమైన వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా, మామిడిలో ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించే యాంటీ కార్సినోజెనిక్(Anti-carcinogenic) లక్షణాలు ఉన్నాయి. పాలీఫెనాల్స్ లుకేమియా, పెద్దప్రేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ వంటి వివిధ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.