Superfoods For Better Immunity : వర్షాకాలంలో(Monsoon) సూక్ష్మ జీవుల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకనే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అంతా ఈ కాలంలో ఎక్కువగా అనారోగ్యాలకు గురవుతుంటారు. అందుకనే ఈ కాలంలో మనం రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. అందుకు కొన్ని ఆహారాలను ఎక్కువగా తినే ప్రయత్నం చేయాలి. మరి అవేంటో తెలుసుకుందాం పదండి.
అల్లం : వర్షాకాలంలో మనం తినే ఆహారంలో ఎక్కువగా అల్లాన్ని చేర్చుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. రోగనిరోధక శక్తి మెరుగుపడటానికి అవసరమైన పోషకాలను శరీరానికి అందిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యునిటీని(Immunity) బూస్ట్ చేస్తాయి. దీంతో ఇది ఫ్లూ, జలుబు, దగ్గులాంటి వాటిని రాకుండా చేస్తుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.
వెల్లుల్లి : వెల్లుల్లిలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. తెల్ల రక్త కణాలను ఎక్కువగా వృద్ధి చేస్తుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూడటంలో తెల్ల రక్తకణాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి.
పాలకూర : ఈ కాలంలో పాలకూర, బచ్చలికూరలను ఎక్కువగా తినడం మంచింది. వీటిలో విటమిన్ ఏ, సీ, ఈలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో జింక్ సైతం అధికంగా ఉంటుంది. ఇవన్నీ మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకరిస్తాయి.
పెరుగు : పెరుగులో మన పేగులకు మంచి చేసే బ్యాక్టీరియాలు ఉంటాయి. వాటినే మనం ప్రోబయోటిక్స్ అని పిలుస్తుంటాం. అవి మన పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుతాయి. తద్వారా జీర్ణ క్రియ సక్రమంగా జరుగుతుంది. ఫలితంగా జీవ క్రియ వేగవంతం అవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
బాదం : వర్షాకాలంలో బాదం పప్పులను నానబెట్టుకుని రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. వీటిలో విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తాయి. కాకపోతే వీటిని మితంగా మాత్రమే తినాలని గుర్తుంచుకోండి.